ETV Bharat / bharat

'మంచి పాలనకే బిహార్​ ప్రజలు ఓటు' - మోదీ న్యూస్​

బిహార్​ యువత, మహిళలు ఎప్పుడూ ఎన్​డీఏతోనే ఉన్నారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి మద్దతుతోనే తమ కూటమి విజయం సాధిస్తోందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు సుపరిపాలన అందించే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు.

Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Nov 4, 2020, 7:18 PM IST

Updated : Nov 4, 2020, 7:39 PM IST

బిహార్​ ప్రజలు సుపరిపాలన అందించే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వయం ఉపాధి పొందే యువతకు కొత్త అవకాశాలు సహా ప్రజలకు భద్రత, ఉపాధిని ఎన్​డీఏ మాత్రమే అందిస్తుందన్నారు.

రాష్ట్రంలోని యువత, మహిళలు ఎల్లప్పుడూ ఎన్​డీఏతోనే ఉన్నారని, తమ కూటమిపైనే నమ్మకాన్ని పెట్టుకున్నారని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు మోదీ.

" ససరామ్​లో తొలి ర్యాలీ నుంచి సహర్సాలోని చివరి ర్యాలీ వరకు, ప్రజలు ఎంతో ప్రేమను అందించారు. బిహార్​ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను సుప్రీంగా పరిగణించింది. కాబట్టి, బిహార్​ ప్రజలు కేవలం సుపరిపాలన అందించే రాజకీయాలనే ఇష్టపడతారు. యువత, మహిళలు అధిక స్థాయిలో పాలుపంచుకుంటారు. ఎన్​డీఏ ఎప్పుడూ విజయం సాధిస్తుందంటే.. అది వారి మద్దతు కారణంగానే. చట్ట పాలనను కొనసాగించటం, పేదల సంక్షేమమే ఆత్మనిర్భర్​ బిహార్​ లక్ష్యం. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం వరకు నిర్వహించిన ర్యాలీలను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్​ చేశారు మోదీ. మూడో దశ పోలింగ్​​ నవంబర్​ 7న జరగనుంది. నవంబర్​ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇదీ చూడండి: 'మోదీ ఓటింగ్​ మిషన్లకు నేను భయపడను'

Last Updated : Nov 4, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.