ETV Bharat / bharat

ఊరి పేరు వల్ల 'కొరోనా' గ్రామస్థులకు వింత కష్టం

author img

By

Published : Mar 30, 2020, 3:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామం పేరు వింటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆ గ్రామస్థులు దరిదాపుల్లో ఉంటే పారిపోతున్నారు. మీరు కూడా ఆ పేరు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ గ్రామం పేరు ఏంటో తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తోన్న 'కరోనా' వైరస్​ను పోలిన పేరు 'కొరోనా'.

.People confuse UP's Korauna for Corona; outsiders even won't take a phone call from village
ఊరి పేరు వల్ల 'కొరోనా' గ్రామస్థులకు వింత కష్టం
ఊరి పేరు వల్ల 'కొరోనా' గ్రామస్థులకు వింత కష్టం

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు కరోనా. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకు... సర్వత్రా కరోనా గురించే చర్చ. ఇదే... ఉత్తర్​ప్రదేశ్‌ సితాపూర్​ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలకు వింత సమస్య తెచ్చిపెట్టింది. ఎందుకంటారా? ఆ గ్రామం పేరు 'కొరోనా' కాబట్టి.

కొద్ది రోజులుగా ఆ ఊరి జనం వారి గ్రామం పేరు చెప్పడానికే భయపడుతున్నారు. తమది కొరోనా గ్రామమని చెప్పగానే.. తమను దూరం పెడుతున్నారని గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. తమకు 'కరోనా' రాలేదని, ఊరు పేరే 'కొరోనా' అని చెప్పినా వినిపించుకునే స్థితిలో ఇతరులు లేరని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊరి పేరు వల్ల తమపై వివక్ష చూపుతారని కలలో కూడా అనుకోలేదని వాపోతున్నారు గ్రామస్థులు.

"మాది కొరోనా గ్రామమని చెప్పగానే మమ్మల్ని తాకడానికి సంకోచిస్తున్నారు. ఊరు పేరు, రోగం పేరుకు మధ్య తేడా అర్థం చేసుకోవట్లేదు. అందుకే మా గ్రామస్థులు ఎవరూ బయటకు రావడం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి."

-కొరోనా గ్రామస్థుడు.

"మేము ఎప్పుడైనా ఫోన్​ చేసి కొరోనా నుంచి మాట్లాడుతున్నాము అని అనగానే ఫోన్​ మాట్లాడే అవతల వారు వెంటనే కాల్​ కట్​ చేస్తున్నారు. కొంతమంది మేము జోక్​ చేస్తున్నాము అని అనుకుంటున్నారు."

-కొరోనా గ్రామస్థుడు.

"రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించినప్పుడు... కొరోనా వెళ్తున్నాము అని సమాధానం చెప్పగానే వారు ఒక్కసారిగా షాక్​కు గురవుతున్నారు. మా ఊరు పేరు, రోగం పేరు ఒక్కటైతే మేము మాత్రం ఏమి చేయగలం?"

-కొరోనా గ్రామస్థుడు.

ఇదీ చూడండి : లాక్​డౌన్​లో ప్రపంచం- చైనాలో 31 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.