కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్ణాటక పెజావర మఠం పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామీజీ(88) కన్నుమూశారు. ఎనిమిది రోజులుగా బెంగళూరులోని కస్తూర్బ ఆస్పత్రిలో చికిత్స పొందిన స్వామీజీ... ఈ ఉదయం 9:20 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు మఠ నిర్వహకులు ప్రకటించారు.
శ్వాస, గుండె సంబంధిత సమస్యలతో స్వామీజీ ఈ నెల 20న బెంగళూరులోని కస్తూర్బా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వైద్య బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించింది. అయితే ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమించగా, ఆయన కోలుకోలేదు.
మోదీ విచారం
స్వామీజీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో ఆయన జీవించే ఉంటారని ఉద్ఘాటించారు. స్వామీజీతో ఉన్న జ్ఞాపకాలను మోదీ గుర్తుచేసుకున్నారు.
-
Sri Vishvesha Teertha Swamiji of the Sri Pejawara Matha, Udupi will remain in the hearts and minds of lakhs of people for whom he was always a guiding light. A powerhouse of service and spirituality, he continuously worked for a more just and compassionate society. Om Shanti. pic.twitter.com/ReVDvcUD6F
— Narendra Modi (@narendramodi) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Vishvesha Teertha Swamiji of the Sri Pejawara Matha, Udupi will remain in the hearts and minds of lakhs of people for whom he was always a guiding light. A powerhouse of service and spirituality, he continuously worked for a more just and compassionate society. Om Shanti. pic.twitter.com/ReVDvcUD6F
— Narendra Modi (@narendramodi) December 29, 2019Sri Vishvesha Teertha Swamiji of the Sri Pejawara Matha, Udupi will remain in the hearts and minds of lakhs of people for whom he was always a guiding light. A powerhouse of service and spirituality, he continuously worked for a more just and compassionate society. Om Shanti. pic.twitter.com/ReVDvcUD6F
— Narendra Modi (@narendramodi) December 29, 2019
"లక్షలాది మంది ప్రజల హృదయాల్లో వేగు చుక్కలా పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామి ఎల్లప్పుడూ జీవించే ఉంటారు. సేవ, ఆధ్యాత్మికత శక్తికి కేంద్రమైన స్వామీజీ... న్యాయమైన, కరుణామయ సమాజం కోసం నిరంతరం పనిచేశారు. ఓం శాంతి."-మోదీ ట్వీట్
బాధాకరం: అమిత్ షా
స్వామీజీ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
-
Sri Vishwesha Teertha Swamiji was an endless source of positivity. His teachings and thoughts will always continue to guide us. I was fortunate to have received his blessings. His passing away is an irreparable loss to the spiritual world. Condolences to his followers. Om Shanti. pic.twitter.com/TIJbVaFcUT
— Amit Shah (@AmitShah) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Vishwesha Teertha Swamiji was an endless source of positivity. His teachings and thoughts will always continue to guide us. I was fortunate to have received his blessings. His passing away is an irreparable loss to the spiritual world. Condolences to his followers. Om Shanti. pic.twitter.com/TIJbVaFcUT
— Amit Shah (@AmitShah) December 29, 2019Sri Vishwesha Teertha Swamiji was an endless source of positivity. His teachings and thoughts will always continue to guide us. I was fortunate to have received his blessings. His passing away is an irreparable loss to the spiritual world. Condolences to his followers. Om Shanti. pic.twitter.com/TIJbVaFcUT
— Amit Shah (@AmitShah) December 29, 2019
"శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ సానుకూలతకు అంతులేని మూలం. ఆయన బోధనలు, ఆలోచనలు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. ఆయన ఆశీస్సులు పొందడం నా అదృష్టం. స్వామీజీ మరణించడం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన అనుచరులకు సంతాపం. ఓం శాంతి."-ట్విట్టర్లో అమిత్ షా.
ఇదీ చదవండి: బ్రిటన్లో ప్రవాస భారతీయులకు అరుదైన గౌరవం