దిల్లీ అల్లర్లపై పార్లమెంట్లో సోమవారం దుమారం చెలరేగిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. దేశంలో శాంతి, సామరస్య స్థాపనకు ఎంపీలు ముందుండాలన్నారు మోదీ. అవి దేశాభివృద్ధికి ఉపయోగపడుతాయన్నారు. భారత్ మాతా కీ జై నినాదం చుట్టూ వివాదం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ ఆక్షేపించారు. 'భారత్ మాతా కీ జై' నినాదం దుర్వినియోగం అవుతుందన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యలను ఖండించిన మోదీ... కొంతమంది ఈ నినాదంలోనూ చెడును వెతుకుతున్నారని పరోక్షంగా విమర్శించారు.
కొన్ని పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, భాజపాకు జాతీయ ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని అన్నారు ప్రధాని. దిల్లీ హింస విషయంలో తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయన్నారు.
ఇదీ చూడండి: దిల్లీ అల్లర్లపై దుమారం.. రాజ్యసభ రెండుగంటలకు వాయిదా