ETV Bharat / bharat

వీసీకేపై కుష్బూ యుద్ధం వెనుక 15 ఏళ్ల పగ! - Dalit leader Manu Smriti Thirumavalavan

మను స్మృతికి వ్యతిరేకంగా విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధ్యక్షుడు తిరుమవలవన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భాజపా నేత, సినీ నటి కూష్బూ చేపట్టిన నిరసనతో ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కుష్బూ తన వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఆందోళనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రతీకారం దేనికి? వీసీకే -కుష్బూ మధ్య ఉన్న పాత గొడవలు ఏంటి?

It is Payback Time: Kushbu takes on Thirumavalavan After 15 Years
15ఏళ్ల తర్వాత కుష్బూ ప్రతీకారం తీర్చుకుంటుందా?
author img

By

Published : Oct 28, 2020, 4:00 PM IST

ఇటీవల కాంగ్రెస్​ నుంచి భాజపాలో చేరిన కుష్బూ సుందర్​ తమిళ రాజకీయాల్లో బిజీ అయ్యారు. విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధ్యక్షుడు తిరుమవలవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమె చేపడుతున్న నిరసనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో కుష్బూను భాజపా ప్రోత్సహిస్తున్నా.. ఆ ఆందోళనల వెనుక ఆమె ఉద్దేశం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిరసనల వెనుక 15 ఏళ్ల నాటి ప్రతీకారం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమవలవన్ ఏమన్నారు..

నెల రోజుల క్రితం యూరోపియన్ పెరియరిస్ట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో చిదంబరం ఎంపీ, ఎస్సీ నాయకుడు, విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధ్యక్షుడు తిరుమవలవన్ మను స్మృతిని కించపరిచేలా, మహిళలను అగౌరవ పరిచేలా వివాదాస్పద వాఖ్యలు చేసినట్లు హిందుత్వ సంఘాలు ఆరోపించాయి. ఆయన క్షమాపణ చెప్పాలంటూ భాజపా, ఆర్​ఎస్​ఎస్​ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. భాజపా ఆందోళనల్లో కుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుష్బూ సుందర్​ను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమవలవన్​ క్షమాపణ చెప్పే వరకు నిరసనలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

It is Payback Time: Kushbu takes on Thirumavalavan After 15 Years
వీసీకే అధినేత తిరుమవలవన్

ప్రతీకారం దేనికి?

2005లో పెళ్లికి ముందుకు సెక్స్​ తప్పు కాదని కుష్బూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

"ఏ విద్యావంతుడు తనకు కాబోయే భార్య కన్యగా ఉండాలని ఆశించడు. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొనాలనుకునే మహిళ.. తాను గర్భవతి కాకుండా, లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలి."

-2005లో కుష్బూ చేసిన వ్యాఖ్యలు

నాడు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇప్పుడు తిరుమవలవన్ నాయకత్వం వహిస్తున్న వీసీకే పార్టీ, పట్టాలి మక్కల్ కచ్చి పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. కుష్బూ ఇంటిని వీసీకే కార్యకర్తలు చుట్టుముట్టారు. ఆమెపై సుప్రీం కోర్టులో 22 వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. విచారణ అనంతరం ఆ కేసులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆమె వ్యాఖ్యలను సైతం సమర్థించింది.

15ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరుమవలవన్ మను స్మృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే భాజపాలో చేరిన కుష్బూ ఉద్దేశపూర్వకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తన అరెస్ట్​ సందర్భంగా కుష్బూ తిరుమవలవన్​కు గతాన్ని గుర్తు చేశారు. మహిళ అని చూడకుండా తనను వేధించారని, అయినా తాను విజయం సాధించానని చెప్పుకొచ్చారు.

వీసీకే ఆందోళనలు..

మను స్మృతిని నిషేధించాలని వీసీకే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించింది. పైశాచిక శక్తులకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రకటించారు తిరుమవలవన్.

తిరుమవలవన్​కు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతోపాటు, కాంగ్రెస్​, ఎన్​టీకే మద్దతు తెలిపాయి. ఆయన‌పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.

విశ్లేషకుల అభిప్రాయం ఇలా..

కుష్బు-తిరుమవలవన్‌ మధ్య వైరాన్ని భాజపా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకుడు సెంథిల్​ నాథన్ అభిప్రాయపడ్డారు. కుష్బూ భాజపాలో చేరిన తర్వాత వ్యక్తిగత రాజకీయ మైలేజీపై ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు కుష్బూపై ఉన్న అభిప్రాయం.. ఆమె భాజపాలో చేరిన తర్వాత మారే అవకాశం ఉందన్నారు.

ఇదీ చూడండి: తమిళనాడులో భాజపా నేత కుష్బూ అరెస్ట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.