దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుకు ఇంకా రెండు రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో తలారి పవన్ జల్లాడ్.. మేరఠ్ నుంచి తిహార్ జైలుకు గురువారం చేరుకున్నాడని అధికారులు వెల్లడించారు.
మూడవ తరం తలారి!
పవన్, ఈ రెండు రోజులు జైలు ప్రాంగణంలోనే ఉండి అక్కడ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించనున్నాడు. ఉరితాడు, ఉరికి సంబంధించి వివిధ అంశాల గురించి శుక్రవారం పరిశీలిస్తాడని అధికారులు తెలిపారు. అదే విధంగా ఉరి శిక్ష ట్రయల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సర్వత్రా ఉత్కంఠ..
అతికిరాతకంగా అత్యాచారం చేసిన నలుగురు నేరస్థులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు.. గతంలో తీర్పు వెలువరించింది. అయితే.. ఒకరి తరువాత ఒకరు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ అంటూ ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
జనవరి 22న అమలు చేయాల్సిన ఉరిశిక్ష... ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. అయితే నేరస్థుల్లో ఒకడైన వినయ్ కుమార్ క్షమాభిక్ష అర్జీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ కారణంగా ఉరి శిక్షపై స్టే విధించాలని దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు దోషులు. ఫలితంగా... ఉరిశిక్ష అమలుపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల్ని ఉరి తీసే పవన్‌కు పారితోషికం ఎంతో తెలుసా?