ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆసుపత్రిలో ఘోరప్రమాదం జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పేలి.. 65 ఏళ్ల రోగి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్న సమయంలో.. ఆక్సిజన్ ప్రవాహం పెరిగి సిలిండర్ పేలినట్లు సిబ్బంది తెలిపారు. సిలిండర్ మార్చాలని వార్డు బాయ్ ప్రయత్నించినప్పటికీ ఒత్తిడి తీవ్రత పెరిగి అది పేలిపోయినట్లు తెలుస్తోంది.
మృతుడిని మోహన్ సింగ్‌గా గుర్తించారు. కొద్దిరోజులుగా కడుపునొప్పిగా బాధపడుతున్న బాధితుడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం.. ముందు జాగ్రత్తగా అక్కడే చికిత్స పొందుతున్న మరో 9 మంది రోగులను వేరే వార్డుల్లోకి తరలించారు.
మరో వాదన..
మరోవైపు.. బాధితుడు ఆసుపత్రిలో చేరినప్పుడే అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు ఇంఛార్జ్ సూపరింటెండెంట్ అజయ్ కోసా. అతడు సిలిండర్ పేలుడుతో చనిపోలేదని, అనారోగ్యం కారణంగానే మరణించాడని చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
ఇదీ చూడండి: రిపబ్లిక్ డే ప్రత్యేక అతిథిగా బ్రిటన్ ప్రధాని!