ETV Bharat / bharat

'అది కరోనా మందు కాదు- ఇమ్యునిటీ బూస్టర్ మాత్రమే'

author img

By

Published : Jun 30, 2020, 8:13 PM IST

కరోనా నుంచి కోలుకునేందుకు ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రకటించిన పతంజలి.. తాజాగా ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది. ఆ ఔషధం కేవలం రోగనిరోధక శక్తిని పెంపొందించేదేనని స్పష్టం చేసింది. మరోసారి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సిద్ధమని పేర్కొంది. మరోవైపు కరోనా కిట్లు తయారు చేయడం లేదని వెల్లడించింది.

Patanjali denies COVID-19 medicine claim, issues clarification
'కరోనా మందు కాదు- ఇమ్యునిటీ బూస్టర్ మాత్రమే'

కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టినట్లు ప్రకటించుకున్న పతంజలి తాజాగా వెనకడుగు వేసింది. 'కరోనిల్'ను కేవలం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికే తయారు చేసినట్లు ప్రకటించింది. కొవిడ్-19కు ఔషధంగా చెప్పలేదని పేర్కొంది.

"మా సంస్థ రోగనిరోధకత పెంచే డ్రగ్స్​ కోసమే లైసెన్సులు తీసుకుంది. 'దివ్య స్వసరి వతి', 'దివ్య కొరోనిల్ ట్యాబ్లెట్', 'దివ్య అను తైల్'.. ఇవన్నీ రోగనిరోధక శక్తినిచ్చే మందు(ఇమ్యునిటీ బూస్టర్)లకు ప్రత్యామ్నాయాలే. క్లినికల్ పరీక్షలను మరోసారి నిర్వహించడానికీ మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎలాంటి తప్పుడు వాదనలు చేయలేదు. మా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు."

-బాలకృష్ణ, పతంజలి సీఈఓ

మరోవైపు.. తాము ఎలాంటి కరోనా కిట్లను తయారు చేయడం లేదని పతంజలి స్పష్టం చేసింది.

పరీక్షలకు నమూనాలు..

ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ లైసెన్స్ అధికారి వైఎస్ రావత్... 'కొరోనిల్' ప్యాకేట్లపై కరోనా వైరస్​ను పోలి ఉన్న చిత్రాన్ని పతంజలి ముద్రించిందని పేర్కొన్నారు.

"మా నోటీసుకు ఇచ్చిన సమాధానంలో ఎలాంటి కరోనా కిట్లను తయారు చేయలేదని పతంజలి తెలిపింది. కొరోనిల్​పై కరోనా వైరస్ ప్రతిబింబించే చిత్రాన్ని ముద్రించింది. కొరోనిల్ సహా మరో రెండు డ్రగ్స్​ నమూనాలను పరీక్షల కోసం తీసుకున్నాం."

-వైఎస్ రావత్, ఉత్తరాఖండ్ లైసెన్స్ అధికారి

ఇదీ కథ!

కరోనా చికిత్స కోసం కరోనిల్, స్వసరి పేరిట ఆయుర్వేద మందుల్ని తీసుకొచ్చినట్లు పతంజలి ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్​లో సానుకూల ఫలితాలు రాబట్టినట్లు చెప్పుకుంది. దీనికి సంబంధించి మీడియాలో ప్రకటనలు ఇచ్చింది.

ఈ విషయంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. కేంద్రానికి స్పష్టతనిచ్చేంతవరకు ప్రకటనలను ఆపేయాలని పతంజలిని ఆదేశించింది. మరోవైపు నకిలీ ఆయుర్వేద మందులు అమ్ముతున్నారనే ఆరోపణలతో రాందేవ్​ బాబా సహా నలుగురిపై రాజస్థాన్​లో కేసు నమోదైంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.