దక్షిణ ముంబయిలోని ఓ పాత ఆరు అంతస్తుల భవనంలో కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండొచ్చని తెలుస్తోంది. 4 అగ్నిమాపక వాహనాలు, రెండు రెస్క్యూ వ్యాన్లు, అంబులెన్సులు ఘటానాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గురువారం సాయంత్రం 4:45గంటలకు మింట్ రోడ్డులోని భానుషాలి భవనంలోని 30-40శాతం భాగం కుప్పకూలింది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరిని శిథిలాల కింద నుంచి తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే భవనంలోని ఇతర భాగంలో ప్రజలు చిక్కుకుని ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
ఘటనాస్థలాన్ని ముంబయి మేయర్ కిశోర్ పెడ్నెకర్ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి:- ఆపరేషన్ కమల్: తర్వాత మహారాష్ట్రేనా?