ETV Bharat / bharat

అ'సాధారణ' వ్యక్తిత్వం.. పారికర్ ప్రస్థానం - రక్షణమంత్రి

ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతితో గోవా భాజపా పెద్దదిక్కును కోల్పోయింది. ఎలాంటి సమస్యనైనా తనదైన శైలి పరిష్కారాన్ని చూపగల పారికర్ రాజకీయ ప్రస్థానం భవిష్యత్​ తరాలకు ఓ పాఠం.

పారికర్ రాజకీయ ప్రస్థానం
author img

By

Published : Mar 18, 2019, 8:30 AM IST

Updated : Mar 18, 2019, 8:48 AM IST

అ'సాధారణ' వ్యక్తిత్వం..

ఓ ఇంజినీర్ రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసా... ఆరెఎస్​ఎస్ కార్యకర్త నుంచి రక్షణమంత్రిగా ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా... గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆ విషయం బోధపడుతుంది.

పాఠశాల దశలోనే ఆర్​ఎస్​ఎస్​లో చేరారు పారికర్. ఐఐటీ నుంచి పట్టభద్రుడైన అనంతరమూ అందులోనే కొనసాగారు. ఆర్​ఎస్​ఎస్​ వ్యక్తిగా అంగీకరించేందుకు ఏమాత్రం సంకోచించని ముక్కుసూటి వ్యవహార శైలి పారికర్ సొంతం.

అనంతర కాలంలో ఆధునిక భావాలున్న నేతగా రూపాంతరం చెందారు పారికర్. సాధారణ జీవనశైలి, అసాధారణ నడవడికతో గోవా ప్రజల్లో మనవాడనే ముద్ర వేయగలిగారు. రాష్ట్రంలో భాజపాకు ట్రబుల్ షూటర్​గా ఎదిగి రెండు దశాబ్దాల పాటు గోవా రాజకీయాల్ని శాసించారు.

సాధారణ దుస్తులు ధరించి రిక్షాలో విమానాశ్రయానికి వెళ్లేవారు పారికర్. తన వస్తువులు తానే మోసుకుంటూ దిల్లీ నార్త్​బ్లాక్​లో కనిపించేవారు. ఎంత సాదాసీదాగా ఉండేవారో నిర్ణయాల్లో అంతే కటువుగా ఉండేవారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయ ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా తప్పుపట్టినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. ఆర్​ఎస్​ఎస్​ బోధనలే లక్షిత దాడులపై నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేశాయని బాహాటంగా ప్రకటించుకున్నారు పారికర్.

ఓ ఆహార నాళికను నాసికలో ధరించి గోవా అభివృద్ధి పనుల్ని పరిశీలించిన పారికర్​ను గుర్తుచేసుకుంటే ఆయనలోని నిబద్ధత కళ్లకు కడుతుంది. 2018 ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పారికర్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజులుగా గోవా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అనంత లోకాలకు చేరారు.

ఇదీ చూడండి: గోవా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి?

AP Video Delivery Log - 2100 GMT News
Sunday, 17 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2053: New Zealand Ardern Condolence No access New Zealand 4201403
Ardern signs Christchurch book of condolence
AP-APTN-1943: Gaza Demonstration AP Clients Only 4201400
Hamas, factions celebrate West Bank attack
AP-APTN-1915: US TX Fire No access US; Must credit: KTRK 4201399
Chemical tank fire at facility near Houston
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 18, 2019, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.