గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతికి సంతాపం తెలిపేందుకు కేంద్ర కేబినేట్ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది.
పూర్వ సహచరుడు మరణం పట్ల పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పారికర్ మృతికి సంతాపంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
జాతీయ సంతాప దినం
మనోహర్ పారికర్ మృతి నేపథ్యంలో ఈ రోజును జాతీయ సంతాప దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గోవా ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తోంది.
ఇదీ చూడండి:రాజకీయాల్లో 'విలక్షణ' సామాన్యుడు