ETV Bharat / bharat

పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు 'టీఆర్​పీ' కుంభకోణం! - టీఆర్​పీ

టీఆర్​పీ కుంభకోణం అంశం పార్లమెంట్​కు చేరింది. ఈ స్కామ్​ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం(సమాచార సాంకేతిక వ్యవహారాలు) నిర్ణయించింది. టీఆర్​పీ అంశాన్ని స్టాడింగ్​ కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులను పిలిపించి వివరణ కోరే అవకాశం ఉంది.

TRP issue
టీఆర్​పీ కుంభకోణం
author img

By

Published : Oct 10, 2020, 5:20 AM IST

ముంబయి పోలీసులు బయటపెట్టిన టెలివిజన్​ రేటింగ్​ పాయింట్స్​(టీఆర్​పీ) కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో టీఆర్​పీ స్కామ్​ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (సమాచార సాంకేతిక వ్యవహారాలు) నిర్ణయించింది. టీఆర్​పీ కుంభకోణాన్ని పార్లమెంటరీ ప్యానల్​ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

టీఆర్​పీ కుంభకోణంపై వివరణ కోరటం, పరిష్కార చర్యల కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులను పార్లమెంటరీ ప్యానల్​ ముందు హాజరయ్యేలా చూడాలని థరూర్​ను కోరారు కాంగ్రెస్​ ఎంపీ, ప్యానల్​ సభ్యుడు కార్తి చిదంబరం. టీఆర్​పీ వ్యవస్థ ఆధారంగానే ప్రభుత్వ ప్రకటనల ఖర్చు ఆధారపడి ఉంటుందన్నారు కార్తి. లోపభూయిష్టమైన సమాచారంతో ప్రజాధనం ఖర్చు చేయకూడదని పేర్కొంటూ థరూర్​కు లేఖ రాశారు. టీఆర్​పీ స్కామ్​తో వ్యవస్థ చట్టబద్ధత, విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తున్నాయని తెలిపారు.

" లోపభూయిష్టమైన టీఆర్​పీ డేటా ప్రకటనల ఖర్చుకు ఆధారం కాకూడదు. టీవీ కంపెనీలు కూడా తమ విలువలను టీఆర్​పీపై ఆధారపడి నిర్ణయిస్తాయి. ఆ విలువ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితిని మరింత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను స్టాండింగ్​ కమిటీ చేపట్టడం చాలా ముఖ్యం. "

- కార్తి చిదంబరం, కాంగ్రెస్​ ఎంపీ.

టీఆర్​పీ కుంభకోణంపై విమర్శలు చేశారు సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్​ ఎంపీ మనీష్​ తివారీ. టీఆర్​పీ మొత్తం నమూనా ప్రసార పరిశ్రమను, ముఖ్యంగా వార్తా మాధ్యమాన్ని ప్రేరేపించిందన్నారు. దీనిని పార్లమెంట్​, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు.

ఇదీ చూడండి: టీఆర్​పీ స్కామ్​ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.