ETV Bharat / bharat

పార్లమెంట్​ భవనంలో మరోసారి శానిటైజేషన్​ - పార్లమెంట్​

పార్లమెంట్​ భవనంలో శానిటైజేషన్​ నిర్వహించారు. ఇటీవల రాజ్యసభ సచివాలయ సిబ్బందిలో ఒకరికి వైరస్​ ఉన్నట్లు తేలింది. ఫలితంగా పార్లమెంట్​లోని అన్ని ప్రాంతాలను శుభ్రపరిచినట్లు తెలిపారు అధికారులు.

Parliament sanitised after latest case of coronavirus
పార్లమెంట్​ భవనానికి మరోసారి శానిటైజేషన్​
author img

By

Published : May 30, 2020, 10:03 PM IST

పార్లమెంట్​ కాంప్లెక్స్​లో మరోసారి శానిటైజేషన్​ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల రాజ్యసభ సచివాలయ ఉద్యోగికి కరోనా నిర్ధరణ కావడం వల్ల.. పార్లమెంట్​ లోపల, వెలుపలి ప్రాంతాలతో సహా వ్యక్తిగత కార్యాలయాలు, విశ్రాంతి గదులు, ఉమ్మడి ప్రాంతాలను శానిటైజేషన్​ చేశారు. సోడియం హైడ్రోక్లోరైడ్​ వంటి బలమైన క్రిమిసంహారక రసాయనాలతో పిచికారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

రాజ్యసభ సచివాలయంలో ఇటీవల ఓ ఉద్యోగికి కరోనా సోకినందున... కొందరు సిబ్బందిని ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని పార్లమెంట్​ ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు పక్కాగా స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించాకే పార్లమెంట్​ భవనంలోకి అనుమతించాలని పేర్కొంది. పార్లమెంట్​ కాంప్లెక్స్​ ప్రవేశానికి ముందే వాహనాలకు కూడా శానిటైజేషన్​ నిర్వహించాలని స్పష్టం చేసింది.

గతంలో మార్చి 21న పార్లమెంట్​లో శానిటైజింగ్​ కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి: గ్రామస్థులపై చిరుత దాడి- కర్రలతో తరిమికొట్టిన ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.