ETV Bharat / bharat

వర్షాకాల సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్‌ సమీక్ష - పార్లమెంట్ సమావేశాలు తేదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లపై లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా సమీక్ష నిర్వహించారు. భౌతిక దూరం పాటించేందుకు అనుసరించిన వ్యూహాలపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్‌ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

Lok Sabha Speaker Om Birla takes review meeting
పార్లమెంట్‌ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్‌ సమీక్ష
author img

By

Published : Aug 27, 2020, 6:21 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణ దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సన్నాహాలు వేగవంతం చేశారు. భద్రత, భౌతిక దూరం పాటించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్‌ సెక్యూరిటీ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, ఉభయసభల సెక్రెటరీ జనరల్స్‌, పార్లమెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ నుంచి సభ్యులను, సిబ్బందిని రక్షించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, మార్గదర్శకాలపై చర్చించారు. ప్రవేశ ద్వారాల వద్ద, పార్లమెంట్‌ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు

కొవిడ్‌ నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు, గ్యాలరీని ఉపయోగించుకోనున్నారు. 60 మంది ఎంపీలు ఛాంబర్లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్‌సభ హాల్లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్‌సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి-సెప్టెంబర్​ 14 నుంచి పార్లమెంట్​ సమావేశాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.