రాజ్యసభలో నిర్భయ కేసు ప్రస్తావన
నిర్భయ కేసుకు సంబంధించి రాజ్యసభలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రస్తావించింది. దోషులకు మరణ శిక్ష అమలులో జరుగుతోన్న జాప్యంపై ఆక్షేపించారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఈ విషయంలో రాష్ట్రపతి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సంజయ్ సింగ్ లేవనెత్తిన అంశంపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందించారు. ఇది చాలా సున్నితమైన విషయమని.. కోర్టు తీర్పును త్వరగా అమలు చేయాలని వ్యాఖ్యానించారు.