ETV Bharat / bharat

పట్టువీడని విపక్షాలు- రాజ్యసభ రేపటికి వాయిదా

parliament budget session live updates
పార్లమెంటు సమావేశాలు సమావేశాలు
author img

By

Published : Feb 2, 2021, 9:42 AM IST

Updated : Feb 2, 2021, 12:37 PM IST

12:33 February 02

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మూడు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు పట్టు వీడలేదు. సాగు చట్టాలపై చర్చకు డిమాండ్ చేశాయి. దీంతో సభను బుధవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

11:33 February 02

రాజ్యసభ మూడో సారి వాయిదా పడింది. 11:30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు సాగుచట్టాలపై చర్చ చేపట్టాలని ఆందోళన కొనసాగించారు. దీంతో 12:30 గంటలకు సభను మరోమారు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.

10:35 February 02

10:30 గంటలకు తిరిగి ప్రారంభమైన రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. సాగు చట్టాలపై చర్చకు విపక్ష నాయకులు పట్టుబట్టడం వల్ల సభను మరోసారి ఉదయం 11:30గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.

09:48 February 02

సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు సభలో గందరోగళం సృష్టించాయి. ఈ విషయంపై తొలుత లోక్​సభలో చర్చించాలని, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించిన తర్వాత బుధవారం సాగు చట్టాలపై చర్చిద్దామని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు విపక్షాలకు సూచించారు. అయితే చర్చ ఇవాళే జరగాలని డిమాండ్​ చేస్తూ విపక్ష నాయకులు సభనుంచి వాకౌట్​ చేశారు. దీంతో ఛైర్మన్​ వెంకయ్య నాయుడు సభను 10:30గంటల వరకు వాయిదా వేశారు.

09:42 February 02

రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్​ చేశాయి. సాగుచట్టాలపై చర్చకు డిమాండ్​ చేయగా.. ఛైర్మన్​ నిరాకరించడంతో నిరసనగా సభను వీడాయి.

09:27 February 02

పట్టువీడని విపక్షాలు- రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దుతుగా విపక్షలు సభలో నినాదాలు చేశాయి. రైతు సమస్యలపై చర్చలు చేపట్టాలని డిమాండ్​ చేశాయి.  అయితే రైతు సమస్యలపై సభలో బుధవారం చర్చిద్దామని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తెలిపారు. 

Last Updated : Feb 2, 2021, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.