జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్ట సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభ ఆమోదించగా నేడు రాజ్యసభలో మూజువాణి ఓటుతో నెగ్గింది.
ఈ బిల్లుతో ఉగ్రవాదులకు భారత్ నుంచి గట్టి సందేశం చేరుతుందని రాజ్యసభలో ఉద్ఘాటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఎన్ఐఏ చట్టాన్ని మోదీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్ షా స్పష్టం చేశారు.
ఏమిటీ బిల్లు?
బిల్లు ఆమోదంతో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోని భారతీయులపై ఉగ్రదాడుల దర్యాప్తునకు అనుమతి లభించినట్లయింది. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపైనా దర్యాప్తు చేయడానికి ఈ సవరణలు అనుమతిస్తాయి.
ఇదీ చూడండి: ఎన్ఐఏ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం