ETV Bharat / bharat

'ఆపరేషన్​ కరోనా'పై పార్లమెంటరీ కమిటీల పరిశీలన - వెంకయ్య నాయుడు

కరోనా సంక్షోభాన్ని దేశం ఎదుర్కొన్న తీరును పార్లమెంటరీ ప్యానెళ్లు పరిశీలిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

Parl panels have started scrutinising handling of COVID-19 in India: Naidu
'కరోనా కట్టడిని పరిశీలిస్తున్న పార్లమెంటరీ ప్యానెళ్లు'
author img

By

Published : Jul 19, 2020, 3:24 PM IST

కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలను పార్లమెంటరీ ప్యానెళ్లు పరిశీలిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. అయితే వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో ఇంత తక్కువ వ్యవధిలో స్టాండింగ్​ కమిటీ సమావేశాలను నిర్వహించడం కూడా కుదిరేది కాదన్నారు. ఈ మేరకు తన ఫేస్​బుక్​ ఖాతాలో పోస్ట్​ చేశారు వెంకయ్య.

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు ఉపరాష్ట్రపతి. పార్లమెంటరీ కమిటీల భేటీలపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాతో మాట్లాడినట్టు పేర్కొన్నారు.

"కరోనా నియంత్రణకు ప్రవేశపెట్టిన భౌతిక దూరం నిబంధనను పాటిస్తూ.. పార్లమెంట్​ సమావేశాల్లో ఎంపీలు పాల్గొనాలి అంటే ఎంతో ఆలోచించాల్సిన విషయం. సరైన ప్రణాళిక కూడా ఉండాలి. వర్షాకాల సమావేశాల నిర్వహించాలని ప్రభుత్వం కూడా కోరింది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్​ సమావేశాలు నిర్వహించేలా చర్యలు చేపడతాం."

--- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

ఆన్​లైన్​ వేదికగా సమావేశాలు జరపాలని పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ.. స్టాండింగ్​ కమిటీలు ఇప్పటివరకు నాలుగుసార్లు భౌతికంగానే భేటీ అయ్యాయి.

కరోనా మహమ్మారి కారణంగా బడ్జెట్​ సమావేశాలు ఈ ఏడాది మార్చి 23న అర్థంతరంగా నిలిచిపోయాయి.

ఇదీ చూడండి:- 'ఒక తరగతి-ఒక ఛానల్​ దిశగా కేంద్రం సన్నాహాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.