ఆ చిన్నారి పుట్టుకతోనే దివ్యాంగుడు. తొమ్మిదేళ్ల వరకు తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. అయితేనేమి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపి, చిరస్థాయిగా నిలిచిపోయాడు కర్ణాటకలోని హుబ్బలికి చెందిన మూర్తి బళ్లారి కుమారుడు గౌతమ్.
తల్లిదండ్రుల దాతృత్వం...
కుమారుడు మరణించినా... ఒకరికి మంచి జరగాలనే సదుద్దేశంతో గౌతమ్ కళ్లను కిమ్స్ ఆసుపత్రిలోని కళ్లులేని ఇద్దరి చిన్నారులకు దానం చేశారు బళ్లారి దంపతులు.
"విధి వక్రించడం వల్ల నా కుమారుడు చనిపోయాడు. గౌతమ్ ఆత్మకు శాంతి కలిగేలా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే గౌతమ్ అవయవాలు దానం చేశాం."
- మూర్తి బళ్లారి, గౌతమ్ తండ్రి
గౌతమ్ది సహజ మరణమని, అవయవాలు దానం చేసిన అతి చిన్న వయసు వారిలో గౌతమ్ ఒకరని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్