తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాలని యత్నించిన భారత జలాంతర్గామిని అడ్డుకున్నామని పాకిస్థాన్ చేసిన ప్రకటనను భారత నావికా దళం తోసిపుచ్చింది. అది తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది.
" పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తూ, అసత్యాలు వ్యాప్తి చేస్తోంది. అలాంటి తప్పుడు ప్రచారాలను భారత నావికాదళం పట్టించుకోదు. మా పని నిరంతరం కొనసాగుతాయి."- భారత నావికాదళం.
అవసరమైతే జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి తప్పనిసరిగా నావికాదళం రక్షణ చర్యలు చేపడుతుందని ప్రకటించింది నావికాదళం. ఎలాంటి భారత జలాంతర్గామి పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు తెలిపాయి.
తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాలని భారత జలాంతర్గామి ప్రయత్నించినట్లు పేర్కొంటూ పాకిస్థాన్ ఓ వీడియోను విడుదల చేసింది.
ఇదీ చూడండీ... పాక్ పిట్ట కథ..!