రెండు పాకిస్థానీ జంటలు గుజరాత్లో ఒక్కటయ్యాయి. రాజ్కోట్ మహేశ్వరీ సమాజ్లో వారి వివాహం జరిగింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత, భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఓ పాకిస్థానీ హిందూ జంట భారత్కు వచ్చి శనివారం పెళ్లి చేసుకుంది. మహేశ్వరీ కులానికి చెందిన వీరు పాక్ కరాచీ వాసులు. వారి వివాహానికి అక్కడ అనుమతి లేనందున సరిహద్దులు దాటి వివాహ వేడుకను జరిపించుకున్నారు.
"మహేశ్వరీ సమాజంలో 90కు పైగా పాకిస్థానీ హిందూ జంటలకు పెళ్లి జరిపించాం. వారిని భారత్లో స్థిరపడేందుకు సహకరించాం. శనివారం పెళ్లి చేసుకున్నవారు కూడా ఇక్కడ ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. గతేడాది మేము 15 మందికి పెళ్లి జరిపించాం. మా కులస్థులు చాలా మంది పాక్లో ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ప్రాణాలకు భద్రత లేదు. ఇక వారి వివాహాలకు అస్సలు ప్రాధాన్యం ఉండదు. కానీ మేమిక్కడ వారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాం."
-మహేశ్వరీ యువజన సంఘం అధ్యక్షుడు, భావేశ్ మహేశ్వరీ
దాదాపు 3000 మహేశ్వరీ కుటుంబాలు కరాచీలో జీవిస్తున్నాయి. వారిలో చాలామంది లాంగ్టైం వీసాను పొంది దానినే పొడగిస్తూ ఇక్కడే ఉండిపోతున్నారు.
ఇదీ చూండండి:ఎరక్కపోయి నదిలో ఇరుక్కున్న బావ బామ్మర్ది!