పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్ము కశ్మీర్ పూంచ్ సెక్టార్లో నియంత్రణరేఖ వెంబడి ఉన్న సైనికుల పోస్టులపై, సమీప గ్రామాలపై మోర్టార్లతో దాడులు చేస్తోంది.
పాక్ సైన్యం ఇవాళ ఉదయం 10 గంటల నుంచి బాలాకోట్, మాంకోట్ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతోంది. ఈ దాడులను భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి.
స్థానికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. భద్రత కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారికి సూచించామని వెల్లడించారు.
ఇదీ చూడండి: భారత భద్రతా దళాలకు తెల్ల జెండా చూపిన పాక్