భారత సైన్యానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఓ వ్యక్తిని రాజస్థాన్ బాడ్మేర్లో అదుపులోకి తీసుకున్నారు ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం, సీబీ-సీఐడీ అధికారులు. నిందితుడు సరిహద్దులో వేతన కార్మికుడిగా పనిచేస్తూ గూడఛర్యం చేస్తున్నాడని.. కొద్ది కాలంగా అతడిపై నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు.
నిందితుడు సామాజిక మాధ్యమాల ద్వారా.. భారత సైన్యానికి చెందిన వివరాలను ఐఎస్ఐ(పాక్ నిఘా సంస్థ)కు పంపుతున్నట్టు అధికారులు ఆరోపించారు. అతడిని బాడ్మేర్ నుంచి జైపుర్‌కు తరలించినట్టు వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా..
అంతకుముందు.. పాకిస్థాన్‌కు గూఢచర్యం వహిస్తున్నాడనే ఆరోపణలతో 36ఏళ్ల వ్యక్తిని జైసల్మేర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా దళ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని సామ్ ప్రాంతానికి చెందిన నవాబ్ ఖాన్‌గా గుర్తించారు. డబ్బు కోసం.. వాట్సాప్ ద్వారా కోడెడ్ సమాచారాన్ని పాకిస్థాన్‌కు అతడు చేరవేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి:- ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్