ETV Bharat / bharat

'కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం! - మన్మోహన్​

సిక్కుల పవిత్ర ప్రదేశం గురునానక్​ మందిరాన్ని కలిపే కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్​​ను ఆహ్వానించాలని పాకిస్థాన్​ నిర్ణయించింది. గురునానక్​ 550వ జయంతిని పురస్కరించుకుని నవంబర్​లో నడవాను ప్రారంభించనున్నట్లు పాక్​ విదేశాంగ మంత్రి ఖురేషీ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమానికి మన్మోహన్​ సింగ్​ హాజరయ్యే అవకాశం లేదని ఆయన కార్యాలయం తెలిపింది.

'కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం!
author img

By

Published : Oct 1, 2019, 5:51 AM IST

Updated : Oct 2, 2019, 5:01 PM IST

'కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం!

నవంబర్​లో నిర్వహించబోయే కర్తార్‌పుర్‌ నడవా ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్​ను ఆహ్వానించాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్​ ఖురేషి ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. త్వరలోనే మన్మోహన్‌కు ఆహ్వాన పత్రికను పంపించబోతున్నట్లు తెలిపారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలకు విచ్చేసే సిక్కులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఖురేషి పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలోని గురునానక్ మందిరాన్ని కర్తార్‌పుర్‌ నడవా కలుపుతుంది. రావి నది ఒడ్డున ఉన్న ప్రముఖ గురుద్వారాను సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు అంత ప్రాధాన్యం. దేశ విభజనకు ముందు నుంచీ పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారాకు చాలా ప్రాముఖ్యం ఉంది.

నవంబర్​ 9 నుంచి..

నవంబర్​ 12న సిక్కుల మతగురువు బాబా గురునానక్​ 550వ జయంతిని పురస్కరించుకుని అదే నెల​ 9 నుంచే భారత సిక్కు యాత్రికులను అనుమతించాలని పాకిస్థాన్​ నిర్ణయించింది. ప్రతి రోజు 5 వేల మందిని అనుమతించేందుకు అంగీకరించింది.

మన్మోహన్​ విముఖత..

పాకిస్థాన్​ ఆహ్వానంపై తమకు ఎలాంటి సమాచారం లేదని మన్మోహన్​ సింగ్​ కార్యాలయం వెల్లడించింది. కర్తార్​పుర్​ ప్రారంభోత్సవానికి సింగ్​ వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఆయన ప్రధానిగా 10 ఏళ్లు పనిచేసిన సమయంలో ఒక్కసారి కూడా పాకిస్థాన్​లో పర్యటన చేయని కారణంగా ఈ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.

మన్మోహన్​ నేతృత్వంలో..

మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధుల బృందాన్ని కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి పంపాలని ప్రభుత్వానికి సూచించారు సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు అభిషేక్​ మను సింఘ్వీ. ప్రధాని నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఎంపిక చేయాలన్నారు. ఐక్యరాజ్య సమితికి వెళ్లే ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించేందుకు వాజ్​పేయీని.. అప్పట్లో పీవీ నరసింహారావు ఎంపిక చేసిన దాని కన్నా గొప్పగా ఉండాలన్నారు. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని మన్మోహన్​ సింగ్​ను ప్రధాని కోరాలనేదే తన ఉద్దేశమని ట్వీట్​ చేశారు సింఘ్వీ.

Manmohan Singh
​ మను సింఘ్వీ ట్వీట్​

ఇదీ చూడండి: 25 ఏళ్లలో గరిష్ఠ వర్షపాతం నమోదు: ఐఎండీ

Gandhinagar (Gujarat), Sep 29 (ANI): Union Home Minister Amit Shah visited the Bahuchar Mata Temple in Mansa, Gandhinagar. He also offered prayers at the temple. On October 01, Shah will visit a Durga Puja Pandal in Kolkata.

Last Updated : Oct 2, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.