భారత్లో సరిహద్దు ద్వారా ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నందునే నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ఘటనలు అధికమైనట్లు సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తెలిపారు.
"నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాల నుంచి ముష్కరులను భారత్కు పంపాలని పాక్ ప్రయత్నిస్తూనే ఉంది. శీతాకాలం కారణంగా ఇది క్లిష్టతరమని భావించి కాల్పులకు తెగడుతోంది. చోరబాటుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కువ సార్లు విఫలమవుతూనే ఉంది. నిరాశకు గురవుతూనే ఉంది."
-మనోజ్ ముకుంద్ నరవాణే,ఆర్మీ ఛీఫ్జనరల్
కశ్మీర్ లోయలో గ్రనేడ్లు విసరడం, ఐఈడీ బాంబు దాడులకు పాల్పడటం వంటి ఉగ్రవాద ఘటనలు గత ఆరు నెలల్లో చాలా తగ్గాయని నరవాణే తెలిపారు. బలగాలకు అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు.