కరోనాతో భారత్ యుద్ధం చేస్తోన్న వేళ పాక్ మరోసారి తన దుర్నీతిని చాటింది. జమ్ముకశ్మీర్‌లో వరుసగా మూడోరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలే లక్ష్యంగా దాడికి తెగబడింది. కాల్పులు, మోర్టార్ షెల్లను ప్రయోగించింది. అయితే పాక్ దాడిని భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి.
గత రెండు రోజులు కూడా భారత్‌పై దాడికి దిగింది దాయాది సైన్యం. బాలాకోట్, పూంఛ్, మన్కోట్ సెక్టార్లు లక్ష్యంగా కాల్పులు చేసింది. భారత్-పాక్ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట ఈ ఏడాదిలో 646 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. 2019లో 3200 సార్లు పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది.
ఇదీ చదవండి:'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'