పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో స్థానికులతో నేడు నిరసన ర్యాలీ నిర్వహించాలని ఆ దేశ సైన్యం ప్రయత్నిస్తోందని భారత అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుపై అక్కసుతో అక్కడి స్థానికులను పాక్ సైన్యం రెచ్చగొడుతోందని ఆరోపించారు.
నియంత్రణ రేఖ వద్ద అలజడులు సృష్టించేందుకు పాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు అధికారులు. అంతర్జాతీయంగా కశ్మీర్ విషయంలో భారత్‌పై వ్యతిరేకత సృష్టించి లాభపడాలని పాక్ భావిస్తోందని తెలిపారు.
అప్రమత్తంగా ఉన్నాం: భారత సైన్యం
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఆర్మీ ఉన్నతాధికారులు. పాక్ సైన్యం కుయుక్తులను తిప్పి కొడుతామన్నారు. నియంత్రణ రేఖ వద్ద కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టించే ఈ ప్రయత్నాలను భగ్నం చేస్తామని ప్రకటించారు.
ఇదీ చూడండి: స్వచ్ఛభారత్ కోసం వింగ్ కమాండర్ వినూత్న ఫీట్