పాకిస్థాన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సంప్రదాయ యుద్ధంలో గెలవలేకే దాయాది దేశం.. పరోక్ష యుద్ధానికి దిగుతోందని ఆరోపించారు. పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో జరిగిన ఏ ప్రత్యక్ష యుద్ధంలోనూ పాక్ గెలవలేకపోయిందని గుర్తుచేశారు కేంద్ర మంత్రి. పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుందన్నారు. కానీ పాక్ మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తూ వస్తోందన్నారు. ఇప్పటి వరకు ఇతరుల భూభాగాల్ని ఆక్రమించుకునే ధోరణి భారత్ ఎప్పుడూ ప్రదర్శించలేదన్నారు. అయితే భారత్‌పై కుట్ర పన్నే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మోదీ దౌత్యవిధానంతోనే...
దేశ ప్రజల భద్రత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలో దాడులు చేయాలనుకునే వారికి దీటైన సమాధానం చెప్పి తీరతామన్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ తీరును ఎండగట్టడంలో భారత్ విజయం సాధించిందని.. దీనికి మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానమే కారణమని అభిప్రాయపడ్డారు.