దాయాది పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్ కథువాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద సైనిక పోస్టులు, సమీప గ్రామాలపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి.
కరోనా మత్రాయ్, ఛాంద్వాల్లో అర్ధరాత్రి 12.45 గంటలకు కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. వారి చర్యలను సరిహద్దు భద్రతా (బీఎస్ఎఫ్) దళాలు ప్రతిఘటించాయి. దాదాపు 3 గంటల వరకు ఎదురుకాల్పులు కొనసాగినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను అండర్‌గ్రౌండ్ బంకర్లలోకి తరలించారు.