ETV Bharat / bharat

'సొరంగాల ద్వారా ఉగ్రవాదులు- డ్రోన్లతో ఆయుధాలు' - Pakistan underground tunnels terrorists India

భూగర్భ సొరంగాలను ఉపయోగించి భారత్​లోకి ఉగ్రవాదులను పాకిస్థాన్ ఎగదోస్తోందని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. వీరికి డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేస్తోందని తెలిపారు. అయితే వీటిని అడ్డుకునే వ్యవస్థలన్నీ సమర్థంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

Pak using underground tunnels to push terrorists, drones to drop arms: J&K DGP
'సొరంగాల ద్వారా ఉగ్రవాదులు- డ్రోన్ల ద్వారా ఆయుధాలు'
author img

By

Published : Sep 14, 2020, 5:28 AM IST

ఉగ్రవాదులను భారత్​లోకి పంపించేందుకు పాకిస్థాన్ భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తోందని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తోందని చెప్పారు.

అయితే చొరబాటు వ్యతిరేక వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని దిల్బాగ్ స్పష్టం చేశారు. సొరంగాల నిరోధక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల బీఎస్​ఎఫ్ గుర్తించిన సొరంగాన్ని డీజీపీ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

"అంతర్జాతీయ సరిహద్దు కింద సొరంగాలు తవ్వడం, ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోయడం పాకిస్థాన్ దుర్మార్గపు ప్రణాళికలో భాగం. 2013-14లో చన్యారీ ప్రాంతంలో గుర్తించినటువంటి భారీ సొరంగం ఇప్పుడు బయటపడింది. సొరంగాల ద్వారా చొరబాట్లు జరుగుతున్నట్లు నగ్రోటా ఎన్​కౌంటర్ తర్వాత మాకు పక్కా సమాచారం అందింది. గతంలోనూ ఈ సొరంగాలను ఉపయోగించి చొరబాటు దారులను పాకిస్థాన్ పంపించిందని స్థానికులు చెబుతున్నారు."

-దిల్బాగ్ సింగ్, జమ్ము కశ్మీర్ డీజీపీ

సరిహద్దు వెంబడి ఇలాంటి మరిన్ని సొరంగాలు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేదు. ఇతర సొరంగాల కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.

ఖాజీగండ్​ సమీపంలో ఓ ట్రక్కులో ఎం-16 రైఫిల్​ సహా అధునాతన ఆయుధాలు స్వాధీనం చేసుకుకోవడంపై స్పందించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సాంబా సెక్టార్​లో డ్రోన్లను ఉపయోగించి ఈ ఆయుధాలను చేరవేసినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.

సమీక్ష

అంతకుముందు జమ్ము ప్రాంతంలోని ఉధంపుర్, కిష్టావర్, రాంబన్ జిల్లాల్లో భద్రతను సమీక్షించారు దిల్బాగ్ సింగ్. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు, భద్రతా దళాలు చేస్తున్న కృషిని అభినందించారు. శాంతికి విఘాతం కలిగించే ఏ అంశాన్ని విడిచిపెట్టకూడదని అన్నారు. భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సమస్యకైనా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.