ETV Bharat / bharat

కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన - పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన రాజ్యసభ

గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలో పాకిస్థాన్ 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. 242 సార్లు సీమాంతర కాల్పులకు తెగబడిందని తెలిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు పేర్కొంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.

Pak resorted to 3,186 ceasefire violations along LoC in Jammu region in last 8 months: Govt
కాల్పుల విరమణకు పాక్ తూట్లు- 3 వేల సార్లు ఉల్లంఘన
author img

By

Published : Sep 15, 2020, 5:37 AM IST

ఓవైపు కరోనా మహమ్మారి ప్రబలుతున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం తన ప్రవృత్తి మార్చుకోవడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పదేపదే కాల్పులకు తెగబడుతూ.. ఉగ్రవాదులను భారత్​లోకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తోంది. గడిచిన 8 నెలల్లో(జనవరి- సెప్టెంబర్ 7 వరకు) జమ్మూలో పాక్ సైన్యం ఏకంగా 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటికి తోడు జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 242 సార్లు సీమాంతర(క్రాస్ బార్డర్) కాల్పులు జరిగినట్లు రాజ్యసభకు తెలిపింది.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వరకు ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఈ కాల్పుల్లో మరణించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. మరో ఇద్దరు గాయపడ్డట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

దీటుగా బదులు

పాక్ కాల్పులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా బదులిచ్చిందని మంత్రి తెలిపారు. కాల్పుల ఉల్లంఘన చోటు చేసుకున్న ప్రతీసారి ఈ విషయంపై సంబంధిత పాక్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.

గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతి నుంచి కశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకే పాక్ కాల్పులకు తెగబడుతోందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.