పుల్వామా దాడి విషయంలో పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడింది భారత విదేశీ వ్యవహారాల శాఖ. ఈ దాడికి జైషే మమ్మద్ ఉగ్ర సంస్థ బాధ్యత ప్రకటించుకుందని, ఈ సంస్థ నాయకులందరూ పాకిస్థాన్‌లోనే ఉన్నారని స్పష్టం చేసింది.
దాడిలో ప్రధాన నిందితుడు మసూద్ అజర్‌కు ఇప్పటికీ పాకిస్థాన్‌లో ఆశ్రయం లభించడం విచారకరమని విదేశీ వ్యవహారాల ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దర్యాప్తు ఆధారాలను పాకిస్థాన్‌తో పంచుకుంటారా అన్న ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.
"పాకిస్థాన్‌కు ఇప్పటివరకు చాలా ఆధారాలు ఇచ్చాం. అయితే ఆ దేశం మాత్రం తన బాధ్యతను ఎప్పటికప్పుడు విస్మరిస్తూ వచ్చింది. 2008 ముంబయి దాడుల సూత్రదారులపైనా పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేసుకోవడం అవసరం."
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి
ఏడాదిన్నర పాటు దర్యాప్తు చేసి ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు చేసినట్లు తెలిపారు శ్రీవాస్తవ. ఉగ్ర దుశ్చర్యకు పాల్పడ్డవారిని చట్టంముందు నిలబెట్టేందుకు ఈ ఛార్జిషీట్ ఉపయోగపడుతుందని అన్నారు.
చర్యలేవి?
పాకిస్థాన్ ఉగ్రవాదుల జాబితా విడుదల చేసినంత మాత్రాన.. వారిపై ఆంక్షలు విధించినట్లు కాదని శ్రీవాస్తవ పేర్కొన్నారు. నిషేధిత ఉగ్రవాదులతో పాటు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులపైనా పాకిస్థాన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఘాటైన స్వరం వినిపించారు.
ఇవీ చదవండి