ETV Bharat / bharat

జపాన్​ ప్రధాని ​త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష - japan pm health issue

పెద్దపేగు సమస్యతో బాధపడుతున్న జపాన్​ ప్రధాని షింజో అబే త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఈ విషయం తెలియగానే బాధపడ్డానని తెలిపారు.

PM-ABE
మోదీ ఆబే
author img

By

Published : Aug 28, 2020, 9:27 PM IST

జపాన్​ ప్రధాని షింజో అబే ఆరోగ్య పరిస్థితి బాధ కలిగించిందని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారని చెప్పారు. ఆయన బలమైన, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు.

PM-ABE
మోదీ ట్వీట్

"మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని బాధపడ్డా. కొన్నేళ్లుగా మీ బలమైన నాయకత్వం, వ్యక్తిగత నిబద్ధతతో భారత్​-జపాన్​ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా."

- ప్రధాని నరేంద్రమోదీ

అనారోగ్యం కారణంగా తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు షింజో అబే. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. కొంతకాలంగా అల్సరేటివ్​ కొలిటిస్​ అనే పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. జపాన్​కు సుదీర్ఘ కాలంగా ప్రధానిగా పనిచేశారు అబే.

ఇదీ చూడండి: అనారోగ్య కారణాలతో జపాన్​ ప్రధాని రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.