ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అనుభవిస్తున్న యాతన... యూపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ట్వీట్ చేశారు.
" అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న భాధ, వేదనను చూసి యూపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆమెకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వలేము. ప్రభుత్వాన్ని క్షమించలేము."
-మాయావతి ట్వీట్.