కేరళ తిరువనంతపురంలో లాక్‌డౌన్ వల్ల మూసివేసిన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని ఇవాళ భక్తుల కోసం తెరిచారు. నేటి నుంచి స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 5 నుంచి దీపారాధన వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్ననట్లు చెప్పారు.
భక్తులు ఆలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు చెప్పారు. కరోనా విస్తృతి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల మార్చి నెలలో ఈ ఆలయాన్ని మూసివేశారు.