వచ్చే నెల 15వ తేదీ వరకు పద్మ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ దరఖాస్తులు లేదా సిఫార్సులను కేవలం ఆన్‌లైన్‌ద్వారా మాత్రమే పంపాలని సూచించింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే పద్మ పురస్కారాలకు మే ఒకటో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివిధ రంగాల్లో గొప్ప విజయాలు సాధించడం సహా తమ జీవితమంతా సమాజాభివృద్ధి కోసం కృషి చేసేవారికి ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకు 8,035 రిజిస్ట్రేషన్లు పోర్టల్‌లో జరిగాయని... అందులో 6,361 నామినేషన్లు, సిఫార్సులు పూర్తయ్యాయని హోంశాఖ తెలిపింది.
ప్రజలకు పెద్దగా పరిచయం లేనివారినే కొన్నేళ్ల నుంచి మోదీ సర్కార్ పద్మ అవార్డులకు ఎంపిక చేస్తోంది.
ఇదీ చూడండి: కరోనాతో కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ మృతి