ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ మూడోదశ ఔషధ ప్రయోగ పరీక్షలు(క్లినికల్ ట్రయల్స్) భారత్‌లో ప్రారంభమయ్యాయి. పుణెలోని ససూన్ జనరల్ ఆస్పత్రిలో ప్రయోగ పరీక్ష చేపట్టినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మురళీధరన్ తంబే తెలిపారు. ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ భాగస్వామి అయిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ ట్రయల్స్‌ను నిర్వహించనుంది.
టీకా మూడో దశ పరీక్షలను ప్రారంభించామని.. దీనికోసం ఇప్పటికే 150 నుంచి 200 మంది వలంటీర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని డాక్టర్ మురళీధరన్ పేర్కొన్నారు. పుణెలోని భారతీ విద్యాపీఠ్ మెడికల్ కళాశాల, కేఈఎం ఆస్పత్రులలో రెండో దశ ట్రయల్స్‌ను నిర్వహించారు. ఇతర దేశాల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్న వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తిన కారణంగా భారత ఔషధ నియంత్రణ మండలి ఇక్కడ ట్రయల్స్‌ను నిలిపివేసింది.
ఇదీ చూడండి: 'బహుళ పక్ష విధానంలో సంస్కరణలు అవసరం'