ETV Bharat / bharat

'సీఏఏపై కాదు నిరుద్యోగంపై దృష్టి పెట్టండి' - National Register of Citizens

బిహార్​ అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఏఐఎంఐఎం చీఫ్​​ అసదుద్దీన్ ఓవైసీ. సీఏఏ, ఎన్​ఆర్​సీల కంటే నిరుద్యోగం, విద్య, ఆరోగ్య సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.

Owaisi slams RJD, JD(U) over CAA, NRC
'వాటి వల్ల దేశంలో సగం జనాభా ప్రభావితమవుతారు'
author img

By

Published : Oct 25, 2020, 9:57 PM IST

బిహార్​ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. బిహార్ అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఐఎంఐఎం చీఫ్​​ అసదుద్దీన్ ఓవైసీ. పౌర సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ)ల కంటే నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలపై దృష్టిసారించాలని ధ్వజమెత్తారు.

"సీఏఏ, ఎన్​ఆర్​సీలను అమలు చేస్తామని మోదీ సర్కారు చెప్పినప్పుడు... ఆర్​జేడీ మౌనంగా ఉంది. భాజపా మిత్రపక్షం జేడీ(యూ) ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది."

- అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎంఐఎం చీఫ్​

ఈ రెండింటి వల్ల ముస్లింలు, దళితులు ఇబ్బందిపడటమే కాకుండా, భారత జనాభాలో 50 శాతం మంది ప్రభావితమవుతారని ఓవైసీ అన్నారు. 'అసోంను ఉదాహరణ తీసుకుంటే.. ఎన్ఆర్​సీలో జాబితా 20లక్షల మందిని గుర్తించలేదు. అందులో ముస్లింలు కేవలం 5 లక్షల మందే ఉండగా.. మిగిలిన 15 లక్షల మంది హిందువులే' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: 'బ్రాండ్​ తేజస్వీ'తోనే ఎన్​డీఏ పోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.