ETV Bharat / bharat

'జీవన్మరణ పోరాటంలో విజయం తథ్యం'

కరోనా కట్టడిలో లాక్‌డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నందుకు క్షమించాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. మనసులో మాట కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. కరోనాపై సాగుతున్న జీవన్మరణ పోరాటంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా..కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో.. లక్ష్మణరేఖ దాటకుండా ఉండాల్సిందేనని చెప్పారు. ఈ పోరాటంలో కలిసికట్టుగా ముందుకెళితే తప్పక విజయం సాధిస్తామన్నారు.

overall story on Modi's Mann ki baat about corona virus
'ఈ జీవన్మరణ పోరాటంలో విజయం సాధిస్తాం'
author img

By

Published : Mar 29, 2020, 7:00 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తప్పని సరి పరిస్థితుల్లోనే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, అందుకు తనను క్షమించాలని 'మనసులో మాట' వేదికగా కోరారు. ప్రజలు తమను తాము రక్షించుకుంటూ తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవాలనే లాక్‌డౌన్‌ విధించామన్న ప్రధాని.. మరికొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటరాదన్నారు.

దేశ ప్రజలందరినీ నేను క్షమాపణలు కోరుతున్నా. మేము తీసుకున్న నిర్ణయాల కారణంగా మీరంతా.. కఠినమైన ఆంక్షలు ఎదుర్కొవాల్సి వస్తోంది. నేను పేద ప్రజలను చూస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో పడేశారు, ఈయనేం ప్రధానమంత్రి అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. వారందరినీ నేను క్షమాపణలు కోరుతున్నా. కొంతమందికి నాపై కోపం కూడా ఉంటుంది. మీ పరిస్థితి, మీ ఆందోళన నాకు అర్థమవుతోంది. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లాంటి దేశానికి కరోనాపై పోరాటంలో ఈ అడుగేయడం ( లాక్‌డౌన్‌) మినహా మరో మార్గం లేదు. కరోనాపై జరిపే యుద్ధం జీవన్మరణ పోరాటం. ఈ పోరాటంలో తప్పక గెలుస్తాం. అందుకోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది గమనించిన తర్వాత.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేందుకు ఈ ఒక్క దారే కనిపించింది.

---నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న కరోనాపై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.

కరోనా కట్టడి కోసం హోం క్వారంటైన్‌లో ఉన్నవారితో కొందరు అనుచితంగా ప్రవర్తించారనే ఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వార్తలు విన్నప్పుడు.. చాలా బాధేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితుల్లో.. మనసుల మధ్య దూరం, మనుషుల మధ్య దూరం రాకుండా.. సామాజిక దూరం పాటించడమే మార్గమని మనం అర్థం చేసుకోవాలి.

----నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి .

కరోనా కట్టడి కోసం కృషిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు అత్యవసర సేవల విభాగాలను ప్రశంసించిన ప్రధాని.. కరోనా బారినపడి కోలుకున్న ఇద్దరు బాధితులు, చికిత్స అందిస్తున్న ఇద్దరు వైద్యులతో సంభాషించారు. చికిత్స సమయంలో.. వారు చూపిన మనోధైర్యాన్ని ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.