ETV Bharat / bharat

దేశంలో 169కి చేరిన కరోనా మరణాలు

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 211మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 1,346 మందికి పెరిగింది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 169కి చేరగా, మహారాష్ట్రలోనే 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 5800కి పైగా కేసులు నమోదయ్యాయి.

virus
'మహా'లో కరోనా విజృంభణ.. కొత్తగా 211మందికి వైరస్
author img

By

Published : Apr 9, 2020, 9:02 PM IST

దేశంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 5,865కి చేరింది. వైరస్​ వ్యాప్తికి మహారాష్ట్ర కేంద్రంగా మారింది. ఒక్కరోజు వ్యవధిలో ఆ రాష్ట్రంలో 211మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య 1,346కి పెరిగింది. రాష్ట్రంలో 72మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

virus
భారత్​లో కరోనా గణాంకాలు

కర్ణాటకలో..

కర్ణాటక గడగ్​ జిల్లాలో వైరస్ కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రంలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 197కు పెరిగింది.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 96మందికి వైరస్ సోకింది. వీటిలో ఎక్కువమంది తబ్లీగీ కార్యక్రమంలో పాల్గొన్నవారని సమాచారం. రాష్ట్రంలో కేసుల సంఖ్య 834కు పెరిగింది. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్​లో తాజాగా ఒకరు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. కొత్తగా 76 మందికి వైరస్ సోకింది. మొత్తంగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 262కు చేరింది.

ఇదీ చూడండి: కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈలపై కేంద్రం దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.