ETV Bharat / bharat

'వందల కోట్ల నిధి ఉన్నా బాధితులకు సాయమేది?' - పర్యావరణ సహాయ నిధి పై ఎన్జీటీ

పర్యావరణ సహాయ నిధి కింద కేంద్రం కేటాయించిన రూ. 881కోట్ల నిధిని బాధితులకు అందించకపోవటంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాధిత కుటుంబాలకు సాయం అందించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

Over Rs 800 crore Environment Relief Fund for victims lying unused, NGT slams MoEF
'వందల కోట్ల నిధి ఉంటే బాధితులకు ఇవ్వరా?'
author img

By

Published : Nov 24, 2020, 6:03 PM IST

అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ సహాయ నిధి కింద కేటాయించిన రూ.881కోట్ల నిధిని బాధితులకు అందివ్వకపోవటంపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్​జీటీ) మండిపడింది.

ఈ నిధిని రసాయన కర్మాగారాలు, హానికారక పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రమాదం జరిగితే వారికి అందించేందుకు కేంద్రం కేటాయించిందని ఎన్​జీటీ గుర్తుచేసింది. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలతో కార్మికులు గాయాలపాలవుతున్నా ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.

" 2020 మార్చి 31నాటికి పర్యావరణ సహాయ నిధి ఖాతాలో రూ.881కోట్లు డిపాజిట్​ అయ్యాయి. వీటిని ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. ఇంత అధిక మొత్తంలో నిధులు ఉన్నా బాధితులకు అందలేదు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి సహాయంగా ఉండాలని కేంద్ర , రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీలను కోరుతున్నాం."

---జాతీయ హరిత ట్రైబ్యునల్.

పర్యావరణ నిధిని బాధితులకు ఇవ్వటం లేదంటూ విశ్రాంత​ ప్రభుత్వ అధికారి జ్ఞాన్​ ప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎన్​జీటీ ఈ వ్యాఖ్యలు చేసింది. నిధిని ఉపయోగించకపోతే పబ్లిక్​ లియాబిలిటీస్​ ఇన్సురెన్సు యాక్ట్​-1991కి అర్థం లేదని పిటిషనర్ వివరించారు. బాధితులకు సహాయం అందించటంలో సంబంధిత కలెక్టర్లు సైతం జాప్యం చేస్తున్నారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.