ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 96వేల మందికిపైగా యోగా శిక్షకులు - Yoga trainers in India

దేశంలో ఇప్పటివరకు సుమారు 96 వేల మందికిపైగా యోగాలో శిక్షణ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 'ప్రధాన​ మంత్రి కౌషల్​ వికాస్​ యోజన' కింద వేర్వేరు విభాగాల్లో శిక్షకులు, బోధకులు తర్ఫీదు పొందారని వెల్లడించింది కేంద్రం.

Over 96,000 trained as Yoga instructors, trainers under skilling initiatives: Govt
దేశవ్యాప్తంగా 96 వేల మందికిపైగా యోగా శిక్షకులు
author img

By

Published : Jun 21, 2020, 6:43 AM IST

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 'ప్రధాన​ మంత్రి కౌషల్​ వికాస్​ యోజన' నైపుణ్య కార్యక్రమం ద్వారా 96,196 మంది యోగాలో శిక్షణ పొందారని కేంద్రం తెలిపింది. గత అనుభవం, స్వల్పకాలిక శిక్షణ, ప్రత్యేక ప్రాజెక్టులు వంటి ఇతర నైపుణ్య కార్యక్రమాల ద్వారా.. బోధకులకు, శిక్షకులకు తర్ఫీదునిచ్చింది కేంద్రం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఈ విషయాలను వెల్లడించింది.

శిక్షణ పొందిన వారిలో అధిక సంఖ్యలో.. ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్​, ఒడిశా, కేరళ, బంగాల్​ రాష్ట్ర అభ్యర్థులే ఉన్నారని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భవిష్యత్తులో యువతను యోగావైపు మళ్లించేందుకు మరింత కృషి చేస్తున్నట్లు నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

'భారత్.. ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతిగా యోగా అని ప్రధాని అన్నారు. మన ప్రాచీన వేద సంప్రదాయాల్లో ఒకటైన యోగా.. ప్రపంచానికి ఆరోగ్య సూత్రంగా మారింది. ఐదేళ్ల కాలంలోనే యోగా మరింత ఆదరణ పొందింది. '

- మహేంద్ర నాథ్​ పాండే, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రి

యోగాలో మూడు రకాలు కోర్సులు ఉంటాయి. అవి:

- యోగా బోధకుడు (ఎన్‌ఎస్‌క్యూఎఫ్-4),

- యోగా శిక్షకులు(లెవెల్​-5)

- యోగా సీనియర్​ శిక్షకులు(లెవెల్​-6)

రాష్ట్రవ్యాప్తంగా అమలు..

ఆరోగ్యం, సౌందర్య విభాగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సీబీఎస్​ఈ పాఠశాలలోనూ వృత్తి విద్యా కోర్సులున్నాయి. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి -కళాశాల స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఇవి అమలుకానున్నాయి.

ఇదీ చదవండి: యోగా డే: ఈసారి సందడంతా నెట్టింట్లోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.