ETV Bharat / bharat

కేరళలో మరో 5,456 మందికి వైరస్​​ - కొవిడ్​-19 ట్రీట్​మెంట్​

దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేరళలో కొద్దిరోజులుగా సగటున 5వేల చొప్పున వైరస్​ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆ రాష్ట్రంలో మరో 5,456 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 6.93 లక్షలకు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2,757 మంది మహమ్మారికి బలయ్యారు.

STATE WIDE CORONA UPDATES IN INDIA
కేరళపై కరోనా పంజా- మరో 5,456 మందికి వైరస్​​
author img

By

Published : Dec 18, 2020, 10:15 PM IST

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేరళలో మరో 5,456 మంది వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 93వేల 865కి చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,757 కరోనా మరణాలు సంభవించాయి.

  • మహారాష్ట్రలో మరో 3,994 మందికి కరోనా​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 18లక్షల 88వేల 767కు చేరింది. కరోనా ధాటికి మరో 75 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 48వేల 574కు ఎగబాకింది.
  • దిల్లీలో మరో 1,418 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6.14 లక్షలకు పెరిగింది. మరో 37 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 10,219కి పెరిగింది.
  • కర్ణాటకలో ఒక్కరోజులోనే 1,222 కరోనా కేసులను గుర్తించారు అధికారులు. దీంతో బాధితుల సంఖ్య 9లక్షల 7వేల 123కు పెరిగింది. కొవిడ్​-19 కారణంగా ఇప్పటివరకు అక్కడ 11,989 మంది చనిపోయారు.
  • తమిళనాడులో ఒక్కరోజులోనే 1,134 వైరస్​ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8లక్షల 4వేలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 11,954 మంది కరోనాకు బలయ్యారు.
  • రాజస్థాన్​​లో శుక్రవారం రోజు 1,076 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. కేసుల సంఖ్య 2.97 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,599 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

'రైతుల నిరసనలతో.. దిల్లీలో కరోనా తగ్గుముఖం!'

కరోనా దావాగ్నిలా వ్యాపించింది: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.