2016-18 మధ్య 32 వేల జంతువులు ప్రమాదవశాత్తు రైళ్ల కింద పడి ప్రాణాలు విడిచినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. కేవలం ఈ ఏడాది జనవరి 1-జూన్ 20 మధ్యే 3,400కుపైగా జంతువులు మృతి చెందాయని తెలిపింది. ఇందులో ఆవులు, సింహాలు, చిరుత పులుల సంఖ్య అధికంగా ఉంది. వీటికి అదనంగా గత మూడేళ్లలో రైళ్లు ఢీకొని 60 ఏనుగులు చనిపోయాయి.
రైలు ప్రమాదాలు తగ్గుతున్నా... పట్టాలపై జంతువులు మృతిచెందుతున్న ఘటనలు పెరగడంపై రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.
రైళ్లకూ నష్టమే...
ఒక్కోసారి జంతువులు ఢీకొని రైళ్లకూ నష్టం జరుగుతోంది. ఈ ఏడాది దారితప్పి పట్టాలపైకి వచ్చిన ఆవుకు తగిలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగం పాడైపోయింది.
పశువులు రైలు పట్టాలపైకి రాకుండా చూసుకోవాలని సిబ్బంది ఎప్పటికప్పుడు రైతులకు చెబుతున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. సమస్య పరిష్కారం కోసం పొలాలు పక్కనున్న పట్టాలకు ఇరువైపులు కంచె ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:కొండంత బాధతో కుప్పకూలిన గజరాజు