సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై అన్ని విపక్ష పార్టీలు ఎక్కు పెట్టిన ప్రధాన విమర్శనాస్త్రం 'నిరుద్యోగం.' ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో 3లక్షల 81వేల కొత్త ఉద్యోగాలు సృష్టించామని ప్రభుత్వం ప్రకటించింది. 2019 బడ్జెట్ ప్రతుల్లో ఈ అంశానికి సంబంధించిన లెక్కలున్నాయి.
రైల్వేశాఖ టాప్...
2017 మార్చి 1 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగాల సంఖ్య 32 లక్షల 38వేల 397. ఆ సంఖ్య 2019 మార్చి 1 నాటికి 36 లక్షల 19వేల 596కు చేరుకుంది. అంటే 3లక్షల 81వేల 199 కొత్త ఉద్యోగాలను సృష్టించింది కేంద్రం.
రైల్వేశాఖలో అత్యధిక నియామకాలు జరిగాయి. 2017-2019 మధ్య కాలంలో 98 వేల 999 కొత్త పోస్టులకు నియామకాలు జరిగాయి. అదే సమయంలో రక్షణశాఖలో ఉద్యోగాలు 42వేల 370 నుంచి 88వేల 717కు చేరాయి. నీటి వనరులు, నదుల అభివృద్ధి- గంగా ప్రక్షాళన కలిపి 3వేల 981 ఉద్యోగాలు పెరిగాయి.
శాఖల్లో కొత్త ఉద్యోగాల సంఖ్య
శాఖ | కొత్త ఉద్యోగాలు |
పోలీసు | 8000 |
ప్రత్యక్ష పన్ను | 29,935 |
పరోక్ష పన్ను | 53,000 |
అణుశక్తి | 10,000 |
టెలికాం | 2,250 |
సైన్స్ అండ్ టెక్నాలజీ | 7,743 |
గనులు | 6,338 |
అంతరిక్ష విభాగం | 2,920 |
సిబ్బంది, పింఛను | 2,056 |
విదేశాంగ వ్యవహారాలు | 1,833 |
సంస్కృతి | 3,647 |
వ్యవసాయం, రైతు సంక్షేమం | 1,835 |
పౌర విమానయాన రంగం | 1,189 |
ఇదీ చూడండి:- ఆ మూడు పులులు ఎలా చనిపోయాయి?