దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 లక్షలు దాటింది. గురువారం 52.96 శాతంగా ఉన్న రికవరీ రేటు, శుక్రవారానికి 53.79 శాతానికి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 10,386 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తంగా వైరస్ నయమైన వారి సంఖ్య 2,04,710కు పెరిగింది.
భారత్లో ఇప్పటివరకు 3.8 లక్షల మందికి వైరస్ సోకగా.. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య సగానికి పైనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గణనీయంగా పెరుగుతోన్న రికవరీ రేటు కాస్త ఊరటనిస్తున్నట్లు తెలిపింది.
పెరిగిన టెస్టింగ్
దేశవ్యాప్తంగా కొవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్లు కూడా పెరిగాయి. ప్రస్తుతం 703- ప్రభుత్వ, 257- ప్రైవేటు పరీక్షా నిర్వహణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఒక్కరోజులోనే 1,76,959 మందికి వైరస్ టెస్ట్లు చేశారు. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 64,26,627కు పెరిగింది.
ఇదీ చదవండి: ఆపరేషన్ కరోనా: మరో డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్