ETV Bharat / bharat

ప్రత్యేక రైళ్లతో వచ్చిన ఆదాయం ఎంతంటే? - speical trains generated revenue for railway board

ప్రత్యేక ప్యాసింజర్​ రైళ్లకు భారీగా ఆధరణ లభిస్తోంది. వచ్చే 7రోజుల్లో ప్రయాణించేందుకు 2లక్షల మంది టికెట్లు రిజర్వేషన్​ చేసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం రూ.45కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది.

Over 2 lakh passengers booked tickets worth Rs 45 cr for spl trains over next 7 days: Rlys
ప్రత్యేక రైళ్లతో రైల్వేశాఖ ఆదాయం ఎంతంటే?
author img

By

Published : May 14, 2020, 3:29 PM IST

లాక్​డౌన్​ సడలింపులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాసింజర్​ రైళ్లలో.. వచ్చే ఏడు రోజుల కోసం 2లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టు రైల్వేశాఖ తెలిపింది. బుధవారం 20,149 మంది తమ గమ్యస్థానాలకు చేరుకోగా.. గురువారం 25,737 మంది ఈ ప్రత్యేక రైళ్లల్లో ప్రయాణించనున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం కేటాయించిన 9 రైళ్లలో 9వేల మంది ప్రయాణికులు దేశ రాజధాని దిల్లీ నుంచి బయల్దేరారు. ఈ-టికెట్ల బుకింగ్​ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ.45.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది రైల్వేశాఖ.

ఈ తొమ్మిది రైళ్లలో ఎనిమిదింటికి వాటి సామర్థ్యాన్ని మించి టికెట్లు బుక్​ అయ్యాయి. బిహార్​ రాజధాని పాట్నాకు వెళ్లే రైలు మాత్రం 87శాతం ప్రయాణికులతో నడిచింది.

వివరాలివే..

  • హౌరా నుంచి దిల్లీ వెళ్లే రైలు సామర్థ్యానికి మించి 122శాతం టికెట్లు బుక్​ అయ్యాయి.
  • దిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే రైలుకు రిజర్వేషన్​ అయిన టికెట్లు 133శాతం.
  • దిల్లీ నుంచి చెన్నై వెళ్లే రైలుకు బుక్​ అయిన టికెట్లు 150శాతం.
  • దిల్లీ నుంచి జమ్ము వెళ్లే రైలుకు 109శాతం టికెట్లు బుక్​ అయ్యాయి.
  • దిల్లీ నుంచి రాంచీ వెళ్లే రైలుకు బుక్​ అయిన టికెట్లు 115శాతం.
  • దిల్లీ నుంచి ముంబయి వెళ్లే రైలుకు రిజర్వ్​​ అయిన టికెట్లు 117శాతం.
  • దిల్లీ నుంచి అహ్మదాబాద్​, దిబ్రూగఢ్​ వెళ్లే రైళ్లకు 102, 133 శాతం చొప్పున టికెట్లు అమ్ముడుపోయాయి.

టికెట్లు సామర్థ్యానికి మించి బుక్​ అయ్యాయంటే ప్రయాణికులు రైళ్లలో నిలబడ్డారని అర్థం కాదు. ప్రతి స్టేషన్​లో ప్రయాణికులు బోర్డింగ్​, డీ బోర్డింగ్ చేస్తున్నారు. ఈ విధంగానే ఎక్కువగా టికెట్లు బుక్​ అయ్యాయి.

-రైల్వే అధికారులు​

మే 1 నుంచి రాష్ట్రంలో 100కిపైగా శ్రామిక్​ రైళ్లు నడుస్తున్నందునే.. బిహార్​కు వెళ్లే రైళ్లలో సామర్థ్యం కంటే తక్కువ టికెట్లు బుక్​ అయ్యాయని అధికారులు తెలిపారు.

వారి టికెట్లు రద్దు...

జూన్​ 30వ తేదీ వరకు బుక్​ చేసుకున్న అన్ని రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే, వలసకూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్​, ప్రత్యేక ప్యాసింజర్​ రైళ్లు నడుస్తాయని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.