ETV Bharat / bharat

ఆ క్యాంటీన్లలో 1000కిపైగా విదేశీ ఉత్పత్తుల తొలగింపు - CAPF canteens

కేంద్ర సాయుధ పోలీసు దళాల క్యాంటీన్లలో వెయ్యికిపైగా విదేశీ ఉత్పత్తులను తొలగిస్తున్నట్లు పేర్కొంది కేంద్రం. దేశవ్యాప్తంగా ఉన్న 1700 క్యాంటీన్లలో జూన్​ 1 నుంచి దేశీయ ఉత్పత్తులనే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది.

CAPF canteens
సీఏపీఎఫ్​ క్యాంటీన్లలో వెయ్యికిపైగా విదేశీ ఉత్పత్తుల తొలగింపు
author img

By

Published : Jun 1, 2020, 4:37 PM IST

కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్​) క్యాంటీన్లలో వెయ్యికి పైగా విదేశీ ఉత్పత్తులను అమ్మవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పోలీసు దళాలు, సాయుధ పోలీసు దళాలకు చెందిన 17 వందల క్యాంటీన్లలో జూన్‌ 1 నుంచి కేవలం దేశీయ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలని మే 13నే కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దేశీయ సంస్థలను ప్రోత్సాహించేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ప్రముఖ సంస్థల ఉత్పత్తులు..

డాబర్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, యూరేకా ఫోర్బ్స్‌, జాగ్వార్‌, హిందూస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ తిను బండారాలు సహా నెస్లే ఇండియా సంస్థల ఉత్పత్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల ఉత్పత్తుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు ఉన్నాయని జారీ చేసిన ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. అందుకే వీటిని సీఏపీఎఫ్​ క్యాంటీన్ల నుంచి తొలగించినట్లు తెలిపింది.

ఏటా దాదాపు రూ.3 వేల కోట్ల వ్యాపారం..

వివిధ రకాల ఆహార పదార్థాలు, వస్తువుల అమ్మకం ద్వారా సీఏపీఎఫ్​ క్యాంటీన్లలో ఏటా 2,800 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ క్యాంటీన్లలో దాదాపు 10 లక్షల మంది సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులు 50 లక్షల మంది వరకు వస్తువులను కొనుగోలు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.