ETV Bharat / bharat

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు! - monsoon parliament sessionlatest news

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హైబ్రిడ్​ లేదా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగే అవకాశముంది. భౌతిక దూరం నియమాలను పాటిస్తూ ఎంపీలందరూ కూర్చునేందుకు పార్లమెంటు భవనం సరిపోనందున వర్చువల్​గా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Options explored for 'hybrid', virtual session of Parliament: Sources
వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు!
author img

By

Published : Jun 9, 2020, 6:44 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో.. పార్లమెంటు సమావేశాల నిర్వహణపైనా అనిశ్చితి నెలకొంది. అయితే వర్షాకాల సమావేశాలను హైబ్రిడ్​ లేదా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహిస్తారని ఇది వరకే పలు ఊహాగానాలు వ్యక్తమవగా.. తాజా పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు, లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా.. ఉభయసభల సెక్రటరీ జనరల్​లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్​-19 ఆంక్షలను పాటిస్తూ.. ఎంపీలందరినీ ఒకే చోట చేర్చేందుకు పార్లమెంటు భవనాలు సరిపోవని ఉభయసభల సెక్రటరీ జనరల్​లు వివరించినట్లు సమాచారం. చట్టసభ సభ్యులందరూ కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ.. కూర్చునేందుకు పార్లమెంటు సెంట్రల్​ భవనంలోగానీ, విగ్యాన్​ భవన్​ ప్లీనర్​ హాల్​లోగానీ సరిపడా సీట్లు లేవని వివరించినట్లు తెలుస్తోంది.

"భౌతిక దూరం ఆంక్షలకు అనుగుణంగా.. రాజ్యసభలో 60మంది, లోక్​సభలో 100 మంది ఎంపీలు మాత్రమే కూర్చునేందుకు వీలవుతుంది. ఒకవేళ గ్యాలరీల్లో కూర్చోబెట్టినా.. ఇంకా కొంత మందికి సీట్లు తక్కువ అవుతాయి" అని వెంకయ్య, ఓం బిర్లాకు ఉభయసభల సెక్రటరీలు వివరించారు.

'వర్చువల్​గా నిర్వహిస్తే సమస్యలేంటి?'

ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలను హైబ్రిడ్​ లేదా వర్చువల్​గా జరిపేందుకు అటు లోక్​సభ స్పీకర్​, ఇటు రాజ్యసభ ఛైర్మన్​లు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశాలు నిర్వహిస్తే తలెత్తే సమస్యలపై దృష్టిసారించాలని లోక్​సభ, రాజ్యసభ సెక్రటరీలను ఆదేశించారు ఉభయసభల అధిపతులు.

హైబ్రిడ్​ సెషన్​లో కొంతమంది ఎంపీలు మాత్రం ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరవుతారు. మిగతావారు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చల్లో పాల్గొంటారు. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జులైలో నిర్వహిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.