ETV Bharat / bharat

తాజా రాజకీయ పరిస్థితులపై నేడు విపక్షాల భేటీ

దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రానున్నాయి. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో నేడు సమావేశం కానున్నాయి. అయితే.. ఈ భేటీకి బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకావట్లేదని సమాచారం.

sonia gandhi
తాజా రాజకీయ పరిస్థితులపై నేడు విపక్షాల భేటీ
author img

By

Published : Jan 13, 2020, 5:05 AM IST

Updated : Jan 13, 2020, 7:54 AM IST

తాజా రాజకీయ పరిస్థితులపై నేడు విపక్షాల భేటీ

జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సహా దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు.. విపక్షాలు నేడు సమావేశం కానున్నాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. సీఏఏపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే... ఈ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకావడం లేదని సమాచారం. భారత్‌ బంద్ సందర్భంగా బంగాల్‌లో వామపక్షాలకు, తృణమూల్​ నేతలకు ఘర్షణలు జరిగిన నేపథ్యంలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు దీదీ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాజస్థాన్‌లోని కోటాలో చిన్నారుల మరణాలపై కాంగ్రెస్‌ను విమర్శించిన మాయావతి సైతం.. భేటీకి దూరంగా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఉగ్రవాదులతో వెళ్తూ చిక్కిన సీనియర్​ పోలీస్​ అధికారి

Intro:Body:

Malappuram: Kerala Cartoon Academy secretary and noted caricaturist Thomas Antony (62) passed away early morning on Sunday at Kottakkal due to heart attack. He had reached Kottakkal from Kottayam for a cartoon camp organized by the Chitrakala Parishath but suffered uneasiness during midnight. Though he was rushed to the nearby hospital, his life could not be saved. He was executive artist of Metro Vartha. Thomas Antony had served Deepika newspaper and was Kottayam Press Club secretary. The Kerala Cartoon Academy offered their condolences to the departed soul. Thomas Antony had bagged several international awards in the caricature field. Known for drawing abstract caricatures,  he devised his own style and had bagged World Press Cartoon’s third prize in caricature.

Conclusion:
Last Updated : Jan 13, 2020, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.